NTV Telugu Site icon

Minister Ambati Rambabu: జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాల్సిందే..! టీడీపీ గంగలో కలిసిపోతుంది

Ambati Rambabu

Ambati Rambabu

Minister Ambati Rambabu: సీఎం వైఎస్‌ జగన్‌కు నారా లోకేష్‌ భయం పరిచయం చేస్తాడా..? అసలు జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో జరిగిన తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి రచించిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీకి పట్టిన శని లోకేష్‌.. ఆ లోకేష్‌ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు తోడల్లుడు వెంకటేశ్వరరావు కూడా ఒక పుస్తకం రాశారు.. చంద్రబాబు అధికార దాహంతో ఆతృతపడుతున్నారు.. లక్ష్మీపార్వతి భుజం మీద నుంచి తుపాకీ పెట్టి ఎన్టీఆర్ ను కాల్చేశారని ఆరోపించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం లక్ష్మీపార్వతికి ఇంకా తెలియదేమో అనుకుంటా.. కానీ, చంద్రబాబు బావమరిదికి తెలుసు అతని నిజ స్వరూపం అన్నారు. బంధుత్వాలను, డబ్బును వాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

మరోవైపు, చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నికల ఖర్చులు పెరిగాయని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు.. ఎన్టీఆర్ ఒక భోళాశంకరుడు.. ఎవరినైనా నిలబెట్టి గెలిపించగలను అన్న విశ్వాసం పొందగలిగిన వ్యక్తి ఎన్టీఆర్.. అలాంటి లక్షణం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వచ్చింది.. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌కి వచ్చిందని తెలిపారు.. చంద్రబాబు అధికారం కోసం ఎవరితో అయినా కలుస్తాడు.. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అందరితో కలిశాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అవ్వాలని పవన్ నానా గడ్డి కరుస్తున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ వి సాంప్రదాయేతర రాజకీయాలన్న ఆయన.. కానీ, ఎవరి భుజాల మీదైనా ఎక్కేందుకు చంద్రబాబు చూస్తున్నాడని సెటైర్లు వేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులు రాజకీయ నాయకులుగా పరిణతి చెందుతున్నారు. కానీ, ఏ సీఎం కొడుకు అయినా ముఖ్యమంత్రి అయ్యాడా అంటే వైఎస్‌ జగన్ మాత్రమే అయ్యాడని తెలిపారు మంత్రి రాంబాబు.. సరుకుంటే రాజకీయ పరిణతి చెందుతారన్న ఆయన.. నారా లోకేష్‌.. సీఎం జగన్ కు భయం పరిచయం చేస్తాడా..? జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి..! అంటూ కామెంట్ చేశారు.. ఇక, టీడీపీకి పట్టిన శని లోకేష్.. లోకేష్ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందన్న ఆయన.. ఏదోలా ప్యాంటు షర్డు వేసి లోకేష్ ని సీటులో కుర్చోపెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. మరోవైపు.. లోకేష్ తో చేరి దత్తపుత్రుడు (పవన్‌ కల్యాణ్‌) పాడైపోతున్నాడు. రోజుకు రెండు కోట్లు సంపాదించే పవన్.. ట్యాక్స్ కడుతున్నాడో లేదో? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. మా కులం వాళ్లు మావాడు సీఎం అవుతాడనుకుంటున్నారు.. పవన్ నాశనం అవ్వడమే కాకుండా సినిమా పిచ్చితో ఉన్న యువకులు పాడైపోతున్నారని పేర్కొన్నారు. త్వరలో పవన్ పై కూడా పుస్తకం రాయాల్సి వస్తుందేమోనన్నారు.. పవన్ కి కూడా ఒక పుస్తకం పంపించాలని లక్ష్మీపార్వతిని కోరారు. ఈ పుస్తకం చదివి పవన్ కల్యాణ్‌ జ్ఞానోదయం పొందాలి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.