NTV Telugu Site icon

Ambati Rambabu: యాంకర్ స్థాయికి జనసేన అధినేత దిగజారిపోయారు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు. పవన్ మరింత కాస్ట్ లీ యాంకర్ అని.. నోట్లు, సీట్ల కోసం మాత్రమే దత్త పుత్రుడు పవన్ అనే యాంకర్ వస్తున్నాడని విమర్శించారు. అసమర్థ కొడుకు కోసం వృద్ద తండ్రి చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోందన్నారు. లోకేష్‌లో మెటీరియల్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. శునకాన్ని కనకపు సింహాసనం మీదు కూర్చోబెట్టేందుకు తండ్రి ప్రయత్నిస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.

Read Also: YSRCP: వైసీపీలో వేగంగా ఎమ్మెల్యేల మార్పు కసరత్తు.. సిట్టింగ్‌ల చివరి ప్రయత్నాలు!

దత్త పుత్రుడు పవన్ యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారని.. లోకేష్ సభకు పవన్ మొదట రాను అన్నారని మంత్రి తెలిపారు. నాదెండ్లతో అడిగినా పవన్ నో అన్నారని.. పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లి నోట్లు, సీట్లు మాట్లాడుకున్నారన్నారు. అందుకే రేపు మీటింగ్‌కు పవన్ కిరాయి తీసుకుని వెళ్తున్నాడన్నారు. పవన్ దిగ జారుడుతనం అందరూ గుర్తించాలన్నారు. రేపటి సభ చాలా కామెడీగా ఉంటుందని.. సోదరుడికి చౌదరులు పదానికి లోకేష్‌కి తేడా తెలియదన్నారు. అశుభాలతో అట్టర్ ఫ్లాప్ షో యువగలమని ఆయన అన్నారు. పవన్ సూట్ కేసులు మోసేది నాదెండ్ల అంటూ మంత్రి పేర్కొన్నారు.

సీట్ల మార్పుపై మంత్రి అంబటి రియాక్షన్
వైసీపీలో అంతర్గతంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. “శాస్త్రీయంగా ఆలోచన చేసి జగన్ మార్పులు చేస్తున్నారు. 175 గెలవటం ఎలా అనే వ్యూహంతో వెళ్తున్నాం. ఫలితాలు ఎన్నికల తర్వాత చూస్తారు. మార్పు జరిగింది అసంతృప్తి అంటున్నారు కానీ అసంతృప్తి లాంటివి ఏం లేవు. 175 సీట్లతో జగన్ మళ్లీ సీఎం అవుతారు. 151 లాభం లేదని 175 కోసం చేస్తున్నారు.” అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.