Minister Ambati Rambabu: చంద్రబాబు, లోకేష్ వాగుడుతోనే పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చుకున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు.. వైఎస్ జగన్ నన్ను ఏం పీకుతాడు అన్న చంద్రబాబు మాటలకు సమాధానం వచ్చింది.. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయట పడింది.. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు.. కక్ష సాధింపు చేయాలంటే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం.. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక, 17ఏని అడ్డు పెట్టుకొని బయట పడాలని చూస్తున్నారు.. కానీ, తప్పు చేయలేదని ఎక్కడ చెప్పడం లేదని దుయ్యబట్టారు మంత్రి అంబటి..
ఇక, పచ్చగా ఉన్న తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ కాలుతో మాడి పోయిందని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.. తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయితే రాజమండ్రిలో లేకుండా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పని అయిపోయిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రజలు అర్థం చేసుకోవాలి.. పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి వెళ్లినట్లు ఉంది.. టీడీపీ.. పవన్ కల్యాణ్ ను కలుపుకుని వెళ్లడం అని సెటైర్లు వేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చేది.. కానీ, ప్రజా ధనాన్ని దోచుకుని దొంగలా దొరికితే సానుభూతి రాదన్నారు.. ముఖ్యమంత్రిగా చేసి అవినీతి కేసులో జైలుకు వెళ్లిన నాయకులకు రాజకీయ చరిత్ర లేదు, ఉండదని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: SL vs PAK: ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. భారత్ దరిదాపుల్లో కూడా లేదు!
మరోవైపు.. లెళ్ల అప్పిరెడ్డి శాసనమండలి విప్ గా నియమించడంపై స్పందించిన మంత్రి అంబటి.. చాటా సంతోషంగా ఉందన్నారు.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వెరవ కుండా పోరాడే తత్వం అప్పిరెడ్డి ది.. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్తున్నాం.. గతం కన్నా మిన్నగా 175 సీట్లు గెలవాలన్న దే మా లక్ష్యం అన్నారు. పరిపాలన క్షేత్ర స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదన్న ఆయన.. సామాన్యుడి చెంతకు ప్రభుత్వం వెళ్లింది.. ఏ సర్టిఫికేట్ కావాలన్న క్యాంప్ పెట్టి మరి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో బస్సు యాత్ర చేపడుతున్నాం.. నవంబర్ 1వ తేదీ నుండి వై ఏపీ జగన్ నీడ్స్ అనే కార్యక్రమం చేస్తామని వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.