NTV Telugu Site icon

Ambati Rambabu Open Letter: మంత్రి అంబటి బహిరంగ లేఖ.. పవన్ రాజకీయం అంతా బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Open Letter: జనసేన అధినేత తాజాగా చేసిన కామెంట్లు పెద్ద చర్చగా మారాయి.. ఎన్నికల్లో పొత్తులు, సీఎం పోస్టు విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే, తాజాగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పొత్తు, సీఎం సీటు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన మంత్రి అంబటి రాంబాబు.. 8 పేజీల లేఖను విడుదల చేశారు.. పవన్ కల్యాణ్ రాజకీయం అంతా బాబు చేత… బాబు వల్ల… బాబు కోసం అన్న నిజాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. ప్రతిపక్షాలన్నింటితో పొత్తు అన్నది కేవలం పవన్ రాజకీయ ఎత్తు మాత్రమే!.. బాబుతో మరోసారి రాజకీయ వివాహ బంధానికి వేదిక రెడీ చేయటానికే రైతుల పేరిట పవన్ రెండు రోజుల పర్యటన! చేశారని ఆరోపించారు.

బీజేపీ- కమ్యూనిస్టులు ఒక పొత్తులో ఉండరని తెలిసు.. బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదని, తాము సొంతంగా గెలవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలే పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇక వారిని బాబు కోసం తాను వదులుకోక తప్పటం లేదన్న అభిప్రాయం కలిగించటానికే రైట్-లెఫ్ట్-సెంటర్ పార్టీలన్నీ కలిసి రావాలన్న వాదనను పవన్ ముందుకు తోశాడు! అని లేఖలో ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.. 2014 నుంచి 18 వరకు బాబుతో పాటు బీజేపీతో కూడా పవన్ దోస్తీ.. బాబుకు మిత్రులైతే పవన్ కూడా మిత్రులే, బాబు- బీజేపీతో విడిపోతున్నప్పుడు పవన్ కూడా అదే రాగం! కదా? అన్నారు.

2018-19లో ఆయన స్టేట్మెంట్లు చూడండి… బీజేపీ మన రాష్ట్రాన్ని పొట్టలో పొడిచిందని… పాచి లడ్డూలు ఇచ్చిందని… విడగొట్టి బీజేపీ సృష్టించిన సమస్యలు చాలు అని… కొత్తగా మరిన్ని ప్రత్యేక సమస్యలు సృష్టించవద్దు అని… ఉత్తరాదికి దక్షిణాది వారు బానిసలు కారని… ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయబోతున్నానని చెప్పాడు! ఎందుకంటే, ప్రత్యేక హోదా వద్దన్న బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నానన్న సంకేతం పంపగానే, పవన్ కల్యాణ్ అదే బాట! మరోవంక, పవన్ కల్యాణ్‌ను టీడీపీ వారు ఏమీ అనవద్దు అని అదే సమయంలో చంద్రబాబు ప్రకటన చేయటం కూడా… దత్త తండ్రి, దత్త పుత్రుడి తెరచాటు, తెర ముందు బంధాలను అనుబంధాలను వెల్లడిస్తోంది! అంటూ తన సుదీర్ఘ లేఖలో మరికొన్ని అంశాలను పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.