Site icon NTV Telugu

Ambati Rambabu: రాష్ట్రంలో ముగ్గురు రాక్షసులు.. అంబటి తీవ్ర వ్యాఖ్యలు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌ ముగ్గురు రాక్షసులు తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, దత్త రాక్షసుడు తయారయ్యారు అంటూ చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. ఇక, అరెస్టు పేరుతో సింపతి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు, అలాంటి సంపతి రాజకీయాలు ఇప్పుడు చెల్లబోవన్నారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కానీ, చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. చట్టానికి అడ్డుపడితే చంద్రబాబుపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు అంబటి.

Read Also: G20: జీ20 సదస్సు .. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1000

ఇక, ప్రాథమిక ఆధారాలు లేనిదే ఏ కేసులు పెట్టరని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. ధైర్యం ఉంటే ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తప్పు చేస్తే తప్పించుకోలేరు.. తప్పు చేయక పోతే అరెస్ట్ ఉండదన్న ఆయన.. చంద్రబాబు దొంగ అయిన పవన్ కల్యాణ్‌ ఒప్పుకోడు అంటూ విమర్శించారు. 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడని చంద్రబాబుపై ఆరోపణలు వచ్చినా, పవన్ కల్యాణ్‌ నోరు మెదపడు.. అది వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం అంటూ దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, చంద్రబాబుకు ఐటీ నోటసుల వ్యవహారంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు.. చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.

Read Also: iPhone 14 Price Drop: ఐఫోన్ 15 లాంచ్‌కు ముందు.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర! కేవలం రూ. 14 వేలకే

మరోవైపు.. ఈ ఏడు వర్షాలు సమృద్దిగా పడలేదన్నారు మంత్రి అంబటి.. శ్రీశైలం , సాగర్, పులిచింతల ప్రాజెక్టుల లో పూర్తి స్థాయి లో నీరు లేదు.. గతంలో ఓవర్ ఫ్లో ఉండేదన్న ఆయన.. ఈ సంవత్సరం ఆగస్టులో సాధారణం కంటే మైనస్ 31 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని.. గడిచిన 100 సంవత్సరాలతో పోల్చితే అతి తక్కువ వర్ష పాతం నమోదయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.. సాగర్ ఆయకట్టులో ఉన్న పరిస్థితి నీ రైతులు గుర్తించాలి.. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆరుదల పంటలపై సాగర్ ఆయకట్టు రైతులు దృష్టి పెట్టాలి.. డెల్టాలో నాట్లుకు ఇబ్బంది లేదు.. అవసరం అయితే వారా బంది నిర్వహిస్తాం అన్నారు. భవిష్యత్ లో మంచి వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

Exit mobile version