Site icon NTV Telugu

Ambati Rambabu: బాబుకు అండగా ఉండాలనుకున్నవారు కూడా తోక ముడిచారు..

Ambati

Ambati

Ambati Rambabu: అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొట్టినవాళ్లు… చర్చకు రమ్మంటే సభ నుంచి వెళ్లిపోయారన్నారు మంత్రి అంబటి రాంబాబు. రోజురోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. చంద్రబాబుకు అండగా ఉండాలనుకున్నవారు కూడా తోక ముడిచారంటూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి. చంద్రబాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు అర్థమవుతుందన్నారాయన. చంద్రబాబు జీవితమంతా అన్యాయాలు, అక్రమాలతోనే రాజ్యాధికారాన్ని చెలాయించారని ఆరోపించారు. రాజకీయాలను డబ్బుమయం చేశారని మండిపడ్డారు అంబటి రాంబాబు.

Read Also: Off The Record: ఉండవల్లి ఎందుకు ఎంటరయ్యారు..? అసలు ఆయన టార్గెట్ ఎవరు..?

ఇక, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుసు విపరీతంగా దోచుకున్నారు అని ఆరోపించారు అంబటి.. దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. రోజురోజుకు వాస్తవాలు బయటకొస్తున్నాయి. చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరని వార్నింగ్‌ ఇచ్చారు. రోజు రోజు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లంగా అర్థమవుతున్నాయి. అందుకే స్కిల్‌ స్కాంపై చర్చించేందుకు ఆహ్వానించినా.. ఆ దొంగలు పారిపోయారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష కాదు. తప్పు చేశారు కాబట్టే ఆయన అరెస్ట్‌ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద వారైనా తప్పు చేస్తే అరెస్ట్‌ కావాల్సిందే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

Exit mobile version