టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కాంలో ఆయన పాత్ర స్పష్టమైందని చెప్పారు. ఇవి రాజకీయ ప్రేరేపిత కేసులు కావని.. వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కేసుల రద్దుకు, బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా ఏమయ్యాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని ఈరోజు కేసులు వచ్చాయంటే ఎలా అని విమర్శించారు.
Read Also: Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై వీడిన ఉత్కంఠ
మరోవైపు కృష్ణా జిల్లాలో చివరి చుక్క కూడా సాధించే వరకూ పోరాటం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణా మిగులు జలాలతో చేపడుతున్న ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల ఆఖరికి వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నెల్ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దశల వారీగా మధ్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Read Also: Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్
ఇదిలా ఉంటే.. ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ కప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ-14గా పేర్కొంది. ఈ క్రమంలో లోకేశ్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అంతకుముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే.