Chickens and Eggs Ban: కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించి.. ఆ జోన్ లో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు.. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.. ఆ పరిధిలో అన్ని చికెన్ దుకాణాలు, గుళ్ల విక్రయాల షాపులను మూసివేశారు.. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు..
Read Also: Pawan Kalyan South Indian Temples Tour: నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన..
ఇక, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో బర్త్ ప్లూ కలకలంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. కిలో మీటర్ పరిధిని పరిమిత జోన్ గా, 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు.. పరిమిత జోన్లో పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపు నిలిపివేశారు.. సర్వేలెన్స్ జోన్ లో చికెన్ షాపుల్లో పనిచేసేవారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి వైద్య బృందాలు.. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.. ఇక, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో గుడ్ల సరఫరాను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చే వ్యాధి అని, తగిన జాగ్రత్తలు పాటిస్తే మానవులకు సోకదని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అధికారులు.. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యాన్ని చెబుతున్నారు..
Read Also: Pawan Kalyan South Indian Temples Tour: నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన..
మరోవైపు.. గోదావరి జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు కూడా ఈ మాయదారి రోగం విస్తరిస్తోంది.. ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్స్ ఫ్లూతో మరో 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.. గంపల గూడెం మండలం అనుమోలు లంకలో మళ్లీ కోళ్లు మృతి చెందాయి.. గత రెండు రోజుల్లో ఇక్కడే 10 వేలకి పైగా కోళ్లు మృతి చెందినట్టు రైతులు చెబుతున్నారు.. తాజాగా ఇవాళ ఉదయం కూడా రెండు వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్టు గుర్తించారు.. బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లోనే మొత్తం కోళ్లు మృతి చెందినట్టు గుర్తించారు వెటర్నరీ అధికారులు.. శాంపిల్స్ సేకరించి.. ల్యాబ్‌కు తరలించే పనిలో పడిపోయారు..