Myanmar : మయన్మార్‌లోని వాయువ్య ప్రాంతంలోని ఒక గ్రామంపై సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా కనీసం 17 మంది పౌరులు మరణించారు. మానవ హక్కుల సంఘం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. భారత సరిహద్దుకు దక్షిణంగా ఉన్న సగయింగ్ ప్రాంతంలోని కనన్ గ్రామంలో ఉదయం జరిగిన వైమానిక దాడిలో దాదాపు 20 మంది గాయపడ్డారని చెప్పారు. ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య అనుకూల నేత ఆంగ్ సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం తొలగించింది.
Read Also:Teja Sajja : నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఏకలవ్య శిష్యుడిని..
గతేడాది ఏప్రిల్‌లో మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా మరణించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరు వెళ్లినట్లు సమాచారం. మయన్మార్ వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ కూడా ఖండించారు. వోల్కర్ టర్క్ మాట్లాడుతూ.. పౌరులపై దాడులకు సంబంధించిన నివేదికలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.
Read Also:HanuMan Movie Team :హనుమాన్ టీం సంచలన ప్రకటన.. తెగే ప్రతి టికెట్లో 5 రూపాయలు రాముడికే..
ఫిబ్రవరి 2021లో మయన్మార్ సైన్యం దేశంలో తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై సైన్యం చర్యలు తీసుకుంటోంది. తిరుగుబాటు తర్వాత మూడు వేల మందికి పైగా పౌరులు మరణించారు. వైమానిక దాడిలో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (ఎన్‌యుజి) కార్యాలయం కూడా ధ్వంసమైంది. దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 150 మందికి పైగా ప్రజలు వేదిక వద్ద ఉన్నారు. వారిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మిలటరీ పాలన వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర రాజకీయ సంస్థల నేతలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.