HanuMan Movie Team :హనుమాన్ టీం సంచలన ప్రకటన.. తెగే ప్రతి టికెట్లో 5 రూపాయలు రాముడికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో ‘హనుమాన్’ తొలి సూపర్ హీరో కథని తెరక్కించారు. ‘హనుమాన్’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ మూవీ కథ మీద నమ్మకంతో వచ్చేస్తోంది. హనుమాన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 7) హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. ఈ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సంక్రాంతికి పోటీ చాలా తీవ్రంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్లే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి థియేటర్ల కేటాయింపు సమస్య గురించి చిరంజీవి ప్రస్తావించారు. అలాగే హనుమాన్ టీమ్‍లో ధైర్యం నింపేలా మాట్లాడారు.
మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా తప్పకుండా చూస్తారని, ఈ విషయంలో ఎలాంటి డౌట్లు వద్దని మెగాస్టార్ తెలిపారు.. హనుమాన్ విజయం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు.ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన సినిమా కంటెంట్‍లో సత్తా ఉండి మనకు దైవాశీస్సులు ఉన్నాయంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అక్కున చేర్చుకుంటారు.. పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. అందుకే ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు అని చిరంజీవి తెలిపారు.. అలాగే జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని కుటుంబంతో తాము వెళ్లనున్నట్టు చిరంజీవి తెలిపారు. అలాగే అదే వేదిక పై చిత్ర యూనిట్ తరపున మెగాస్టార్ కీలక ప్రకటన చేసారు.హనుమాన్ సినిమా ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్లలో ప్రతీ టికెట్‍పై 5 రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వడానికి హనుమాన్ టీమ్ నిర్ణయించుకుందని చిరంజీవి ప్రకటించారు. ఈ కీలక నిర్ణయానికి హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డిని మెగాస్టార్ అభినందించారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని ఆయన అన్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!