Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake In Ongole: ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆకస్మికంగా భూమి కంపించినట్లు ప్రజలు పేర్కొన్నారు. కొంతసేపు ఇళ్లలోని ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో చాలామంది ఇళ్ల బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. భూ ప్రకంపనల విషయమై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ప్రకంపనల తీవ్రత ఎంత మేరకు నమోదైందన్న విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.. అయితే, గతంలోనూ పలుసార్లు ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించిన విషయం విదితమే..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
తాజావార్తలు
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..