తమిళనాడులో కిడ్నాపర్ అనే అనుమానంతో వలస కూలీపై దాడి చేశారు స్థానికులు. ఈ ఘటన తిరువళ్లూర్‌లోని పరికపటు గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వలస కూలీ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ రోడ్డుపై ఆడుకుంటున్న కొంతమంది పిల్లలతో మాట్లాడాడు. అయితే.. అతను కిడ్నాపర్ అనే అనుమానంతో గ్రామస్తులు అంతా కలిసి అతన్ని చుట్టు ముట్టారు. బాధితుడిని అక్కడ ఉన్న వారంతా చితకబాదారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Director Krish: డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న క్రిష్
స్థానికుల దాడిలో బాధితుడి ముఖం, భుజానికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా.. అతన్ని ఓ గుడిలో వేసి నిర్భందించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే.. ఆ ప్రాంతంలో కిడ్నాప్ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడుని ఆసుపత్రిలో చేర్చామని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read Also: Pawan Singh: సమయమే సమాధానం చెబుతుంది.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వ్యాఖ్యలు
కాగా.. తమిళనాడులో రెండు వారాల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 19న చెన్నైలో జరిగిన మొదటి ఘటనలో.. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాపర్ అనే అనుమానంతో స్థానికులు కరెంట్ స్తంభానికి కట్టేసి మరి దారుణంగా కొట్టారు. నగరంలోని పల్లవరం సమీపంలోని ఓ హోటల్ లో భోజనం చేసి తిరిగి వస్తుండగా దాడికి పాల్పడ్డారు.