NTV Telugu Site icon

Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

Mid Day Meal

Mid Day Meal

Mid Day Meal In Colleges: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు

475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 398 కళాశాలలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయని, దాంతో జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా పాఠశాలల్లోనే భోజనం తయారు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు అధికారులు. ఈ పథకం కోసం ఈ ఏడాదిలో రూ.27 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రధానంగా ఈ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అనేక ప్రాంతాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి చాలామంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించి కాలేజీకి చేరుకుంటున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజనం అందించడం మంచి తోడ్పాటును అందించనుంది.

ఇక మధ్యన భోజనంలో ఏం పెడతారన్న విషయానికి వస్తే..
* సోమవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* మంగళవారం నాడు అన్నం, పప్పు, ఎగ్ కర్రీ, రసం, రాగిజావ అందిస్తారు.
* బుధవారం నాడు వెజ్‌ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* గురువారం నాడు అన్నం, సాంబార్, ఎగ్ కర్రీ, రాగిజావ అందిస్తారు.
* శుక్రవారం నాడు పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* శనివారం నాడు అన్నం, వెజ్ కర్రీ, రసం, రాగిజావ, పొంగల్‌ స్వీట్ అందిస్తారు.

Show comments