MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) తమ హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తో తలపడుతుంది. ఇక ఈ సీజన్ లో తొలిసారి వాంఖడే స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే, గత మ్యాచ్ లతో పోలిస్తే ఇరు జట్ల ప్లేయింగ్ XI లో మార్పులు జరిగాయి. ముంబై ఇండియన్స్ లో విల్ జాక్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం చేసాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ లో మొయిన్ అలీ స్థానంలో సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక మొదటి రెండు మ్యాచ్ లలో ఘోరంగా ఓటమిపాలైన ముంబై ఈ మ్యాచ్ తో పాయింట్స్ టేబుల్ లో ఖాతా తెరవాలని చూస్తుంది. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Bank Holidays: ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల బ్యాంకుల సెలువు లిస్ట్ ఇదే!
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI:
రియన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్, విగ్నేష్ పుత్తూర్.
రిజర్వ్ ఆటగాళ్లు:
రోహిత్ శర్మ, కొర్బిన్ బోష్, రాజ్ బావా.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI:
సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వేంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రామందీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రిజర్వ్ ఆటగాళ్లు:
ఆన్రిచ్ నోర్కియా, మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా.