హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై తన దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా ఎల్‌అండ్‌టీ, సంబంధిత యాడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. "కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం నా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించాను. ఈ రాత్రికే పూర్తిగా అటువంటి…
Business Headlines 28-02-23: అమరరాజా ఆర్ అండ్ డీ: అమరరాజా బ్యాటరీస్ సంస్థ.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ఏర్పాటుచేయనుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో ఈ ‘‘ఆర్ అండ్ డీ’’ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. ఇ-హబ్ పేరుతో సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు తమ గిగా కారిడార్ ప్రోగ్రామ్‌లో భాగమని అమరరాజా కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం విలువ 9 వేల 500 కోట్ల రూపాయలని పేర్కొంది.