Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
- నెల రోజల క్రితం పిస్టల్‌తో కాల్పుల ఘటన..
- సొంత వదినను హత్య చేయించేకుట్ర..
- పోచమ్మవాడలో ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజులు మారాయి.. ఆస్తి కోసం సొంత బంధాలు.. బంధుత్వాలు కూడా వదిలేసుకుంటున్న రోజులు వచ్చేశాయి. ఇంకా చెప్పాలంటే మనోడై పగోడవుతున్నాడు. డబ్బు, ఆస్తులు ఉంటే చాలు.. బంధాలు అవసరం లేదని చాలా మంది అనుకుంటున్నారు. ఒక్కోసారి డబ్బు, ఆస్తుల కోసం అత్యంత దారుణంగా హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మెట్పల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం అన్న కుటుంబానికే ఓ వ్యక్తి స్పాట్ పెట్టాడు. కానీ అదృష్టవశాత్తూ.. వారికి భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి.. బతికి బయటపడ్డారు. ఐతే సరిగ్గా నెల రోజుల తర్వాత కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది?
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దాదాపు నెల రోజల క్రితం పిస్టల్‌తో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదమే ఈ హత్యాయత్నానికి కారణమని తేల్చారు. సొంత వదినను హత్య చేయించేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్ సచిన్‌కు సుపారీ ఇచ్చి.. పిస్టల్‌తో కాల్పులు జరిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
జూన్ 15న అర్ధరాత్రి మెట్పల్లి పోచమ్మవాడలో ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. భారీ శబ్దంతో అక్కడి స్థానికులు ఉలిక్కి పడ్డారు. స్థానికంగా నివసిస్తున్న గోనెల లక్ష్మి అనే మహిళపై జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. తొలుత కర్రలు, రాళ్లతో దాడి జరిగిందని భావించిన పోలీసులు… శస్త్రచికిత్సలో బాధితురాలి చెంప నుంచి బుల్లెట్ బయటపడటంతో దర్యాప్తు దిశ మార్చేశారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ విశ్లేషణలు కేసులో కీలకంగా వ్యవహరించాయి. ఆర్థిక లావాదేవీల కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు కచ్చితమైన సమాచారం లభించింది. దీంతో ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నమని గుర్తించారు. ఆస్థి వివాదాల నేపథ్యంలో గోనెల శంకర్, అతని భార్య అనూష, బంధువు ముత్తన్న కలిసి ఉత్తరప్రదేశ్‌కు చెందిన తమ జేసీబీ డ్రైవర్ సచిన్ వర్మకు సుపారీ ఆశ చూపినట్లు పోలీసులు తెలిపారు. సౌదీకి పంపిస్తామని, భారీ మొత్తం ఇస్తామని ప్రలోభపెట్టి హత్యకు ఒప్పించినట్లు వెల్లడించారు.
సచిన్ వర్మ ఉత్తరప్రదేశ్‌లో రూ.40 వేలతో నాటు పిస్టల్, మూడు కార్ట్రిడ్జ్లు కొనుగోలు చేసి మెట్‌పల్లికి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. జూన్ 15 అర్ధరాత్రి ముఖానికి రుమాలు కట్టుకుని గోనెల లక్ష్మిపై కాల్పులు జరపగా… బుల్లెట్ చెంపను తాకడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే గోనెల శంకర్, అనూష, ముత్తన్నను అరెస్ట్ చేసిన పోలీసులు… తాజాగా ఉత్తరప్రదేశ్ లో సచిన్ వర్మను అదుపులోకి తీసుకుని మెట్పల్లి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల వద్ద నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన పిస్టల్, రెండు సజీవ కార్ట్రిడ్జ్లు, హోండా ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్, ఐఫోన్- 11ను స్వాధీనం చేసుకున్నారు.
గోనెల శంకర్‌కు తన అన్న రాజంతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. రాజం మానసికంగా బలహీనమైన వ్యక్తి కావడంతో అతని భార్య లక్ష్మీ అతని బాగోగులు, కుటుంబ విషయాలు చూసుకుంటోంది. ఈ క్రమంలో తనకు రావాల్సిన ఆస్తి కొంచెం కూడా అన్న రాజాం, వదిన లక్ష్మీకి చెందవద్దు అనే దురుద్దేశంతో గోనెల శంకర్ పథకం వేశాడు. ఇద్దరినీ చంపేస్తే ఆస్తి తనదే అవుతుందని కలలు కన్నాడు. ఇందులో భాగంగా జూన్ 15న అర్ధరాత్రి తర్వాత ఇంటి వద్ద నిద్రిస్తున్న రాజాం, భార్య లక్ష్మీపై దాడికి తెగబడ్డారు. తుచ్ఛమైన ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులే హత్యకు కుట్ర పన్నడం… అందుకు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చి రంగంలోకి దింపడం సంచలం కలిగించింది.
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!