ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids MEPMA Additional Director Yadagiri Rao: పేదరికాన్ని నిర్మూలించాల్సిన శాఖలోనే ఓ అధికారి కోట్లకు పడగలెత్తడం తీవ్ర కలకలం రేపింది. పట్టణ పేదల సంక్షేమం చూసే ‘మెప్మా’ (Mission for Elimination of Poverty in Municipal Areas) అడిషనల్ డైరెక్టర్ నల్లగట్ల (నల్లబోతు) యాదగిరి రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ బృందాలు ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీల ఇళ్లతో సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక తనిఖీల్లోనే సుమారు రూ.4.75 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం (Market Value) వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఏసీబీ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో లభ్యమైన ఆస్తులు చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. యాదగిరి పేరిట హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో ఉన్న 12 ఖాళీ ప్లాట్లు (Plots) గుర్తించారు. వీటి విలువ రూ. 58.63 లక్షలుగా ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ ఉప్పల్ (Uppal) పరిధిలోనే రూ. 31.36 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు (Residential Flats), రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే G+3 భవనంతో పాటు ఓ పెంట్‌హౌస్ (Penthouse) ఉన్నట్లు తేలింది. వీటితో పాటు సూర్యాపేట జిల్లాలో ఒక ఆర్సీసీ ఇల్లు, ఉప్పల్‌లో ఒక దుకాణం కూడా బయటపడ్డాయి. ఇల్లు, భూములే కాకుండా విలాసవంతమైన జీవితానికి సంబంధించిన సామాగ్రి కూడా లభ్యమైంది.
Also Read
- US Midterm Elections Results: అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం.. 70 శాతం మంది యూత్‌కి ట్రంప్ నచ్చలే..
- హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
- Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
- King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
నగదు, నగలు, వాహనాల రూపంలో భారీగా ఆస్తులు లభించాయి. తనిఖీల్లో దాదాపు 1.8 కేజీల (1,792.2 గ్రాములు) బంగారు ఆభరణాలు (Gold Jewellery) లభించాయి, వీటి విలువ రూ. 33.82 లక్షలుగా పేర్కొన్నారు. అలాగే రూ. 1.80 లక్షల విలువైన 3 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విషయానికొస్తే ఒక టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) తో పాటు మరో లగ్జరీ కార్ దొరికాయి, వీటి మొత్తం విలువ రూ. 73 లక్షలు ఉంటుందని అంచనా వేసారు. ద్విచక్ర వాహనాలు, రూ. 29.08 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 7.01 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Electronic Gadgets), వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 32.30 లక్షల నగదును ఏసీబీ గుర్తించింది.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బ్యాంక్ లాకర్లు (Bank Lockers), స్థిరాస్తి పత్రాలను లోతుగా పరిశీలిస్తున్నారు. అధికారులు ఇంకా నిందితుడికి సంబంధించిన అదనపు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు యదగిరి రావును హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో (Special ACB Court) హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం (Bribe) డిమాండ్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి చేసింది. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064 తో పాటు వాట్సాప్ నెంబర్ 9440446106 ను అందుబాటులోకి తెచ్చింది. సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపింది.
తాజావార్తలు
-
ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
-
US Midterm Elections Results: అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం.. 70 శాతం మంది యూత్‌కి ట్రంప్ నచ్చలే..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Trump’s Midterm Setback: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ పార్టీ ఓడితే భారత్‌కు లాభమా? నష్టమా?
-
Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి