మెహ్రీన్ పిర్జాదా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. ఆ తరువాత దర్శకుడు మారుతి తెరకెక్కించిన మహానుభావుడు సినిమాలో నటించింది.శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమా మంచి విజయం సాధించింది.అయితే మహానుభావుడు సినిమా తర్వాత ఈ భామ వరుస ప్లాప్స్ ను ఎదుర్కుంది. జవాన్, పంతం, నోటా మరియు కవచం వంటి చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే ఎఫ్ 2 సినిమాతో మరలా సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా భారీ విజయం సాధించింది.కానీ ఆ తరువాత మళ్ళీ ఆమెను పరాజయాలు వెంటాడాయి.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 సినిమా కూడా ఆకట్టుకోలేదు.. మెహ్రీన్ కు ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గాయి.ప్రస్తుతం ఈ భామ స్పార్క్ పేరుతో ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తుంది.. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. స్పార్క్ మూవీ షూటింగ్ దశలో ఉంది.. అలాగే ఈ భామ మరో కన్నడ చిత్రం కూడా చేస్తుంది.ప్రస్తుతం ఈ భామ పర్సనల్ లైఫ్‌లో కాస్త ఖాళీ టైమ్ దొరకడంతో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది అక్కడి ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఆమె ఫ్రాన్స్ వెకేషన్ పిక్స్ ని షేర్ చేసింది. ఫ్రాన్స్ లోని సెయింట్ ట్రోపెజ్ వద్ద దిగిన పిక్స్ ని ఆమె షేర్ చేసింది. ఇందులో స్టైలిష్ లుక్ తో అదరగొట్టింది. పొట్టి షాట్‌లో ఆ హాట్ థైస్ చూపిస్తూ కిర్రాక్ పోజులిచ్చింది.. మొత్తంగా అన్ని యాంగిల్స్ లో ఈ భామ విజువల్ ట్రీట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.