Meher Ramesh : టాలీవుడ్ టాప్ బ్యానర్ నుంచి ఆఫర్ అందుకున్న మెహర్ రమేష్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాను తెరకెక్కించాడు…అయితే ఈ సినిమా చిరంజీవి కెరియర్‌లోనే దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.. శక్తి, షాడో లాంటి భారీ డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లు గా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటి అని అందరికి సందేహం కలిగింది.. కానీ ఇవన్నీ పక్కనబెట్టి చిరంజీవి లాంటి స్టార్ హీరో అవకాశం ఇస్తే ఆ భారీ ఆఫర్ ను అస్సలు ఉపయోగించుకోలేక పోయారు మెహర్ రమేష్..
భోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెహర్ రమేష్ ఇక సినిమాలు చేయరని ఆయన ఇండస్ట్రీ లో తేరుకునే అవకాశమే లేదని వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యానర్ నుంచి మెహర్ రమేష్ కు ఆఫర్ వచ్చిందని సమాచారం… తక్కువ బడ్జెట్ లో ఒక మూవీ నిర్మించాలని వారు మెహర్ రమేష్ ను కోరారట.. అది కూడా సుమారు రూ. 5 కోట్ల లోపు సినిమాను పూర్తి చేయాలని కండీషన్ కూడా పెట్టినట్లు సమాచారం..దీంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తుంది.కొత్త వారితో ఈ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి మళ్లీ టాలీవుడ్ రేసులో నిలబడాలని మెహర్ ఎంతో పట్టుదల తో ఉన్నారని సమాచారం.. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
తాజావార్తలు
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!