Pramod Muthalik: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి.. జాబ్, భద్రత కల్పిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pramod Muthalik: లవ్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి ముస్లిం యువతులను ట్రాప్ చేయాలని శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులను కోరారు. శ్రీరామ సేన నుంచి యువతకు రక్షణ కల్పిస్తామని ముతాలిక్ హామీ ఇచ్చారు. ప్రేమ పేరుతో వేలాది మంది హిందూ యువతులను మోసం చేశారని ఆరోపించారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ముతాలిక్ మాట్లాడుతూ, “ హిందూ యువతను నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మనం ఒక హిందూ యువతిని నష్టపోతే.. కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను ఆకర్షించాలి. అలా చేస్తే శ్రీరామ్ సేన మీ రక్షణ బాధ్యతను తీసుకుంటుంది. ఉపాధి కల్పిస్తుంది. లవ్ జిహాద్ తో మన అమ్మాయిలు దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. మన చర్యలతో వారిని హెచ్చరించాలి”అని ఆయన సూచించారు.
Read Also: ChatGPT : మోదీ, మస్క్‌ల గురించి సంచలన విషయాలు చెప్పిన చాట్ జీపీటీ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఉడిపిలోని కర్కల సెగ్మెంట్ నుండి రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ముతాలిక్. తనపై ఇప్పటివరకు 109 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఎక్కువ భాగం బీజేపీ హయాంలోనే ఉన్నాయని చెప్పారు. హిందుత్వ విషయంలో సొంత వారి నుంచే తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం అందించిన కొందరు బీజేపీ నేతల మద్దతు తనకు ఉందని ముతాలిక్ తెలిపారు. ఎన్నికల్లో పోరాడాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాలు ఎలా ఆడాలో తనకు తెలియకపోయినా, తన అభిప్రాయాలు ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నాయని శ్రీరామ సేన అధినేత అన్నారు.
Read Also: DJ: డీజే పెడతావా.. నీ పెళ్లి, నేను చేయను పో
బీజేపీ బూటకపు హిందుత్వకు నేను మద్దతిచ్చి ఉంటే ఈపాటికి ఎన్నో విజయాలు సాధించి ఉండేవాడినన్నారు. కర్కల స్థానంలో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనకు వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా, నిజమైన హిందుత్వం కోసం శ్రీరామ సేన పోరాడుతోందని ముతాలిక్ అన్నారు. ప్రస్తుత కర్కల ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే కూడబెట్టిన ఆస్తులను లెక్కిస్తే నియోజకవర్గంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తేలిపోతుందని ఆరోపించారు. కన్నడ, సాంస్కృతిక శాఖ రాష్ట్ర మంత్రి వి సునీల్ కుమార్ ప్రస్తుతం కర్కల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!