Site icon NTV Telugu

Visvambhara : గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్

New Project 2024 10 12t111146.463

New Project 2024 10 12t111146.463

Visvambhara : లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర”. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారీ ట్రీట్ టీజర్‌ను ఈ దసరా పండుగ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. చాలా ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ వండర్ విశ్వంభర. ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేశారు. మరి ఈరోజు విడుదలైన టీజర్ ఎలా ఉందో చూద్దాం.

టీజర్ స్టార్ కాగానే హలీవుడ్ మూవీ అవతార్ సినిమాలో మాదిరి రెక్కల పక్షులు కనిపిస్తాయి. వెంటనే ఆకాశం నుంచి ఓ రాక్షకుడు ఇక్కడికి వస్తాడు. వెంటనే విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా పుట్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది. అంటూ బ్యాగ్రౌండ్ డైలాగ్స్ వినిపిస్తాయి. తర్వాత ఓ పాప మిత్రా.. యుద్ధం వస్తందని అన్నావు కదా ఎలా ఉంటుంది ఆ యుద్ధం అని ప్రశ్నిస్తుంది. తర్వాత రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఎంట్రీ అదిరి పోయిందనే చెప్పాలి. తర్వాత రాక్షకులకు యోధుడికి మధ్య జరిగే యుద్ధం కధాంశంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

టీజర్ చూస్తుంటే రాక్షసుల లోకం, మరో ప్రపంచం ఉన్నట్లు.. మెగాస్టార్ చిరంజీవికి దైవాంశ ఉన్నట్లు, దుష్టశక్తులను ఎదిరించినట్లు తెలుస్తుంది. టీజర్ లో మొత్తం గ్రాఫిక్స్ తోనే నిండిపోయింది. చిరంజీవి తెల్లని రెక్కల గుర్రంపై వచ్చే షాట్ అదిరిపోయింది.ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా మరో అయిదుగురు నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా వేయడంతో విశ్వంభర సినిమాని వాయిదా వేశారు. మీరు కూడా విశ్వంభర టీజర్ చూసేయండి.

Read Also:Telangana Auto Drivers: కొత్త ఆటోల కొనుగోలుకు ‘నో ఫర్మిట్’.. జీరో పొల్యూషన్‌పై రవాణా శాఖ దృష్టి..

Read Also:ICICI Bank Scam Case: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్.. సెల్పీ వీడియోతో బ్యాంక్‌ మేనేజర్ సంచలనం..

Exit mobile version