Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుడెప్పుడో మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజైపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంకా విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి, గతేడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ, విఎఫ్‌ఎక్స్ కారణంగా వాయిదా పడుతు వస్తోంది. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం గట్టిగా వర్క్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ పట్ల చిత్ర యూనిట్‌తో పాటు.. మెగాస్టార్ కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం.
అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఏడాది జూన్ లేదా జులైలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా మొదటి నుంచి ప్రచారంలో ఉంది. బడ్జెట్ 200 నుంచి 250 కోట్ల వరకు ఉంటుందనే టాక్ ఉంది. కానీ, ఇప్పుడు ఇది డబుల్ అయినట్టుగా తెలిసింది. ఏకంగా 400 కోట్లు అని.. సినిమాటోగ్రాఫర్ చోటా కే. నాయుడు చెప్పడం విశేషం. విశ్వంభర గురించి ఓ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. విశ్వంభర’ కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నాము. ఎందుకంటే, ‘విశ్వంభర’లో చాలా సీజీ వర్క్ ఉంది. అక్కడ నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు! సీజీ వర్క్ బాగుండాలి. ఎందుకంటే, ఆ మూవీ వెనక రూ.400 కోట్లు ఉంది. అందుకే చాలా టైమ్ తీసుకుంటున్నాం. ఇది ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. విశ్వంభర బడ్జెట్ డబుల్ అయిందనే చెప్పాలి.
Also Read
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
తాజావార్తలు
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!