Site icon NTV Telugu

Mega vs Allu Family: మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు?

Mega Vs Allu

Mega Vs Allu

మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేధాలు ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ సపోర్ట్‌గా నంద్యాల వెళ్లడంతో.. అల్లు వర్సెస్ మెగా వార్ మరింత ముదిరినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలోనూ అదే ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల కాలంలో ఈ ఫ్యామీలిలలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి చూస్తే ఎలాంటి విబేధాలు లేనట్టుగానే ఉంది. పలు కార్యక్రమాల్లో మెగా, అల్లు ఫ్యామిలీ కలిసి కనిపించడంతో మెగా వర్సెస్ అల్లు వార్ ముగిసినట్టేనని అనుకున్నారు.

కానీ ఇప్పుడు మళ్లీ కొత్త సందేహాలు మొదలయ్యాయి. మొన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట 2025 దీపావళి సెలబ్రేషన్స్ వేడుక ఘనంగా జరిగింది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యామిలీ కూడా వేడుకలో సందడి చేసింది. అదే సమయంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సీమంతం కార్యక్రమం కూడా జరిపించారు. ఈ విషయాన్ని కాస్త లేటుగా రివీల్ చేశారు. ఈ సీమంతం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అలాగే ఉపాసన కుటుంబం కూడా సందడి చేసింది.

Also Read: Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్‌!

అయితే 2025 దీపావళి పార్టీ ఫొటోస్‌లో కానీ.. ఉపాసన షేర్ చేసిన సీమంతం వీడియోలో కానీ ఎక్కడా కూడా అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కనిపించలేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు స్నేహ.. ఎవ్వరూ కూడా మెగా దివాళి సెలబ్రేషన్స్ సహా ఉపాసన సీమంతం వేడుకలో కనిపించలేదు. దీంతో మరోసారి నెట్టింట రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అల్లు ఫ్యామిలీ ఉపాసన సీమంతం వేడుకకు రాకపోవడానికి కారణాలు ఏమైనా.. మళ్లీ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందనే చర్చ మాత్రం మొదలైంది.

Exit mobile version