Mega vs Allu Family: మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు?
- మెగా వర్సెస్ అల్లు వార్ ముగిసినట్టే అనుకున్నారు
- ఇప్పుడు మళ్లీ కొత్త సందేహాలు మొదలు
- మరోసారి నెట్టింట రకరకాల ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేధాలు ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ సపోర్ట్‌గా నంద్యాల వెళ్లడంతో.. అల్లు వర్సెస్ మెగా వార్ మరింత ముదిరినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలోనూ అదే ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల కాలంలో ఈ ఫ్యామీలిలలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి చూస్తే ఎలాంటి విబేధాలు లేనట్టుగానే ఉంది. పలు కార్యక్రమాల్లో మెగా, అల్లు ఫ్యామిలీ కలిసి కనిపించడంతో మెగా వర్సెస్ అల్లు వార్ ముగిసినట్టేనని అనుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ కొత్త సందేహాలు మొదలయ్యాయి. మొన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట 2025 దీపావళి సెలబ్రేషన్స్ వేడుక ఘనంగా జరిగింది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యామిలీ కూడా వేడుకలో సందడి చేసింది. అదే సమయంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సీమంతం కార్యక్రమం కూడా జరిపించారు. ఈ విషయాన్ని కాస్త లేటుగా రివీల్ చేశారు. ఈ సీమంతం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అలాగే ఉపాసన కుటుంబం కూడా సందడి చేసింది.
Also Read
Also Read: Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
అయితే 2025 దీపావళి పార్టీ ఫొటోస్‌లో కానీ.. ఉపాసన షేర్ చేసిన సీమంతం వీడియోలో కానీ ఎక్కడా కూడా అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కనిపించలేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు స్నేహ.. ఎవ్వరూ కూడా మెగా దివాళి సెలబ్రేషన్స్ సహా ఉపాసన సీమంతం వేడుకలో కనిపించలేదు. దీంతో మరోసారి నెట్టింట రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అల్లు ఫ్యామిలీ ఉపాసన సీమంతం వేడుకకు రాకపోవడానికి కారణాలు ఏమైనా.. మళ్లీ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందనే చర్చ మాత్రం మొదలైంది.
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?