70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది యువీ క్రియేషన్స్. వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతున్న నేపథ్యంలో ఎక్కడా రాజీ పడటం లేదు టీం. డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసిన వశిష్ట చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఓ వింతైన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
Also Read : VIJAY : TVK విజయ్ పై మాజీ PRO షాకింగ్ కామెంట్స్
ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు ఎలా రప్పించాలో టెక్నిక్ తెలిసిన అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఫిల్మ్ మన శంకర్ వర ప్రసాద్ గారూ. రౌడీ అల్లుడు, గ్యాంగ్ స్టర్, ఘరానా మొగుడు తరహాలో వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నాడు. చిరు స్వాగ్‌ని కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులు ఆయన్ను ఎలా కోరుకుంటున్నారో అలానే తన మూవీలో ఉండనున్నారని హైప్ క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను చిరుకు మరింత చేరువ చేసేందుకు పుష్కలమైన కంటెంట్ వండి వార్చనున్నాడు అనిల్. వెంకీతో కలిసి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. ఇక మాస్ ఆడియన్స్ కోసం బాబీని రంగంలోకి దింపారు చిరు. మెగా 158 ఎలా ఉండబోతుందో ఒక్క పోస్టర్ చెప్పకనే చెప్పేసింది. ఫక్త్ వయెలెంట్, ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లు అర్థమౌతుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. సో ఇలా ముగ్డురు డైనమిక్ దర్శకులతో క్లాస్, మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు చిన్నా పెద్దా తేడాలేకుండా అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి.
