NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం..

New Project (56)

New Project (56)

పవన్ కల్యాణ్ సాధించిన పొలిటికల్ గ్రాండ్ విక్టరీని మెగా ఫ్యామిలీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. పొలిటికల్‌గా తన పవర్‌ ఏంటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్‌. కారు మెయిన్‌ గేట్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే… అభిమానుల కేరింతలు.. లోపలికెళ్లి కారు దిగగానే… గులాబీలు చల్లుతూ.. ఆనందస్వాగతం పలికారు. రాజకీయాల్లో రాణించాలన్న పట్టుదలతో పదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పవన్ కల్యాణ్.. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో తన పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అన్న చిరంజీవి ఇంటికి జనసేనాని వెళ్లిన వేళ.. ఈ సంబరాలు జరిగాయి. అధిక సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.

READ MORE: Suicide Attempt : బిల్డింగ్ పైనుంచి దూకిన వ్యక్తి.. ఎలా బయట పడ్డాడంటే..

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ తో పాటు ఆయన వెంట వచ్చిన భార్య అన్నాలెజినా, కొడుకు అఖిరానందన్ కు ఘనస్వాగతం పలికింది. పవన్ కల్యాణ్ చిరంజీవి ఇంటికి రావడంతో అక్కడ అంతా ఓ పండుగ వాతావరణం కనిపించింది. మెగాస్టార్ కుటుంబంలో ఆనందోత్సాహాలు, భావోద్వేగాలు కనిపించాయి. పవన్ కల్యాణ్ పట్ల వారి కుటుంబ సభ్యులు చూపించిన ప్రేమాభిమానాలు, తన ఫ్యామిలీ మెంబర్స్ కి జనసేనాని ఇచ్చే ప్రాధాన్యత అందరి హృదయాలను గెలుచుకుంది. ఢిల్లీ స్థాయి నేతగా ఎదిగిన తన కొడుకును చూసి పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి జనసేనాధిపతిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకున్నారు. అటుపై పవన్ కల్యాణ్ తల్లి పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

READ MORE: David Warner: ఏమైంది డేవిడ్ భాయ్.. అసలెలా పొరపాటుపడ్డావ్..

అందరూ గర్వించే విధంగా తన కొడుకు రాజకీయాల్లో విజయం సాధించడం పట్ల అంజనాదేవి పవన్ కల్యాణ్ చూసుకొని మురిసిపోయారు. చిరంజీవి పవన్ కల్యాణ్ మెడలో పెద్ద గులాబీ పూల దండ వేసిన జనసేనాని చూసి మురిసిపోయారు. తమ్ముడు తన కంటే ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని పొందడం చూసి చిరంజీవి కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. రామ్ చరణ్ బాబాయికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఆనంద భాష్ఫాలు కురిపించింది.

READ MORE: BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?

Show comments