NTV Telugu Site icon

Hyderabad: వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం..

Vh

Vh

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు. కులగణన చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా సభ పెడదామని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు.
కుల గణన సరిగ్గా చేయలేదు.. మన సంఖ్యను తగ్గించారు అనే అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు. నీకు మంత్రి పదవి ఇస్తే కృతజ్ఞత సభ పెడదామని కొందరు నేతలు చెప్పారు.

PM Modi: ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో మోడీ వ్యాఖ్య

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో కాపులకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్‌లో కరువైందని అన్నారు. మున్నూరు కాపులు మంత్రి వర్గంలో లేక పోవడం ఇదే మొదటి సారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మున్నూరుకాపు నేతలకు కీలక పదవులు ఇచ్చింది.. అంతే విధేయతతో పనిచేశామని నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కూడా మున్నూరు కాపులు అవసరాన్ని గుర్తించాడు.. రెండు సార్లు మంత్రి వర్గంలో తీసుకున్నాడని తెలిపారు. ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాడని పేర్కొన్నారు. బీజేపీ కూడా మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

CM Chandrababu: రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉంది..

బీజేపీ, బీఆర్ఎస్ నుండి దక్కినన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు.. కాంగ్రెస్ నుండి రాలేదు. నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరుగుతోందని నేతలు పేర్కొన్నారు. మున్నూరు కాపులను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయం నేతలు వ్యక్తం చేశారు. డి.శ్రీనివాస్, కేకే, వీహెచ్, పొన్నాలకు దక్కిన స్థాయి నేడు కాంగ్రెస్‌లో లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఓ సామాజిక వర్గం మన మీద కుట్రలే కాదు.. దాడి చేసినంత పని చేస్తోందన్నారు. మన ప్రాధాన్యత తగ్గిస్తే.. మనం కూడా తగ్గించడం అనివార్యమన్నారు నేతలు. మరోవైపు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంశం పై కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ మల్లన్న ఎత్తుకున్న నినాదం కరక్టే కానీ పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి.. ఒక బీసీ నేతపైనే కాదు.. పార్టీ లైన్ దాటిన ఇతర నేతలపై కూడా ఇదే రకమైన చర్యలు ఉండాలని నేతలు అభిప్రాయ పడ్డారు. కృతజ్ఞత సభకు బదులు.. మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.

Fire Accident: పంజాగుట్ట షాన్‌బాగ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

మున్నూరు కాపుల సమావేశంలో కొన్ని తీర్మానాలు నిర్ణయించారు. అందులో…
*మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చేసి చూపించారు.. దీన్ని సరిదిద్దాలి
*ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు మున్నూరు కాపులకు ఇవ్వాలి
*మున్నూరు కాపుల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలి.. సీఎం శంకుస్థాపన చేయాలి
*మున్నూరు కాపుల సంఖ్య సరిదిద్దాలని సీఎంను కలవడం.. సరిదిద్దినాక ఐదు లక్షల మందితో సభ
*సభ నిర్వహణకి సన్నాహక కమిటీ.. కమిటి చైర్మన్‌గా వీహెచ్.