Flying Bike : గాల్లో విమాన ప్రయాణాలు నేడు సాధారణమయ్యాయి. ఈ మధ్యే ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా త్వరలోనే అందుబాటులోకి గాల్లో ఎగిరే బైకులు రానున్నాయి. ఎగిరే బైక్ భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని కొన్నేళ్లుగా ప్రజలు ఊహించుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో, చాలా మంది దాని గురించి కలలు కూడా కంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమ కారును బైక్‌లా నిర్మించారు. ఇలాంటి వీడియోలు రోజురోజుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎగిరే బైక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Read Also: S Jaishankar: హిమాలయాల్లో ఇండియా-చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
జపనీస్ స్టార్టప్ AERWINS XTURISMO పేరుతో ఫ్లయింగ్ బైక్‌ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరగలిగే హోవర్‌బైక్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్‌గా దీన్ని పేర్కొంటున్నారు. హోవర్‌బైక్ ప్రస్తుతం జపాన్‌లో అమ్మకానికి ఉంది. AERWINS CEO ఈ బైక్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. XTURISMO వీడియో సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపిస్తోంది. వైరల్ వీడియోలో, ఆ బైక్‌పై ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అవతలివాడు దూరం నుంచి ఇదంతా చూస్తున్నాడు. బైక్ నడపడానికి కూర్చున్న వ్యక్తి. ఆ బటన్‌ను నొక్కిన కొన్ని సెకన్లలో, బైక్ గాలిలో ఎగురుతుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @entrepreneursquote షేర్ చేశారు. నిజానికి ఈ వీడియో @xturismo_official ద్వారా అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. దాంతో పాటు బైకు గురించి పలు ప్రశ్నలు కూడా అడుగుతున్నారు.
Read Also: Anantapur SP: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవు
This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm
— Reuters (@Reuters) September 16, 2022