Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.

  • మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం..
  • ముస్కాన్, సాహిల్ ఉరిశిక్ష అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు..
Meerut Blue Drum Case

Meerut Blue Drum Case

Meerut Blue Drum Case:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును దోషులు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం వీరి పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు వీరి అప్పీల్‌ను స్వీకరించి, తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

భర్త సౌరవ్ రాజ్‌పుత్‌ను చంపి, ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్‌లో పెట్టి, దానిపై సిమెంట్‌తో కప్పివేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మీరట్ కోర్టు తీర్పుపై దోషులు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయగా, జస్టిస్ సలీల్ కుమార్ రాయ్, జస్టిస్ పదమ్ నారాయణ్ మిశ్రాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం విచారించింది.