Rajinikanth: నటుడు రజనీకాంత్ తమిళ చిత్రసీమలో టాప్ స్టార్. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా ‘సూపర్ స్టార్’, ‘లీడర్’ అని పిలుచుకుంటారు. నటనలో డిప్లొమా చేసేందుకు రజనీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడే ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ రజనీకాంత్‌ను గుర్తించారు. దీని తర్వాత 1975లో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో రజనీ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తన కెరీర్‌లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్నారు.
Read Also: Gold demand: ఇండియాలో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం డిమాండ్..
ఇటీవల సినీ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నటి మీనాకు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రజనీకాంత్ మీనా గురించి ఆసక్తికర విషయం మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నేను 169 సినిమాల్లో నటించాను. 50 సినిమాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేశాను. హీరోయిన్లతో 110 సినిమాల్లో నటించాను. వారిలో 5, 6 మంది హీరోయిన్లు నాతో 6 సినిమాల్లో నటించారు. నాకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకరు శ్రీదేవి కాగా మరొకరు మీనా. ‘ఎంగే కేత ఘోల్’ చిత్రంలో మీనా వయసు 7 ఏళ్లు. సినిమాలో నా కూతురిగా నటించింది.
Read Also:Terrifying Video : పులి దాడిని లైవ్‌లో చూశారా.. చూస్తే చెమటలు పట్టాల్సిందే
తర్వాత మీనాను ‘అన్పుళ్ల రజనీకాంత్’లో చూశాను. సినిమాలో మేనమామగా నటించాను. తర్వాత ‘యాజమాన్’(తెలుగులో రౌడీ జమీందారు) చేస్తున్నప్పుడు అడిగాను. హీరోయిన్ ఎవరు? మీనా అన్నారు. ఏ మీనా అని అడిగాను. వెంటనే, నన్ను సముదాయించి.. మీనా నటించిన రెండు తెలుగు చిత్రాల్లోని పాటను ప్లే చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నేను చూసిన చిన్న పిల్ల. ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. మొదటి రోజు షూటింగ్. ఎజమాన్ లో మీనాను చూడబోతున్నాను. కానీ ఎంతకీ మీనా నా ముందుకి రాలేదు. ఎలాగోలా ఆ సినిమా ముగించాం. మీనా చాలా ప్రతిభావంతురాలు. చాలా నిజాయితీపరులు కూడా. వారి ఉన్నతమైన ఆలోచనే వారిని పైకి తీసుకొచ్చింది. మా ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా మీనా, అమ్మ వచ్చి పాల్గొనాలి’ అంటూ రజనీ ఉద్వేగంగా మాట్లాడారు.