టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మహేష్ బాబు పక్కన శ్రీలీలా హైలెట్ అయ్యింది. పాప సెకండ్ హీరోయిన్ గా మిగిలింది.. ఇక ఇప్పుడు మీనాక్షి వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ ఫామ్ లో ఉంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో పాటుగా దుల్కర్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తుంది..
అలాగే మెగా వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా లో కూడా హీరోయిన్ చేస్తుంది.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అమ్మడు దగ్గరకు వచ్చింది. అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఇలా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంది.. తాజాగా వైట్ డ్రెస్సులో, క్యూట్ స్మైల్ తో కుర్రకారును ఫిదా చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేసుకోండి.