Meenakshi Chaudhary: హీరో సుశాంత్‌తో తనకు ఉన్న స్నేహం, డేటింగ్ పుకార్లు, వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆమె అన్నారు. సుశాంత్ తనకు చాలా మంచి స్నేహితుడని, తన మొదటి సినిమా ఆయనే హీరోగా మొదలైందని మీనాక్షి తెలిపారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ స్నేహాన్ని మించి ఏదైనా ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
Steve Smith History: రికార్డులు తిరగరాసిన స్టీవ్ స్మిత్.. హాబ్స్, సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్!
“పుకార్లను చిటికెడు ఉప్పుగా తీసుకోవాలి” అంటూ ఈ విషయమై నవ్వుతూ స్పందించారు. ఇండస్ట్రీలో పని చేసే సమయంలో మంచి మాటలూ ఉంటాయని, చెడు మాటలూ ఉంటాయని, మనల్ని ఇష్టపడేవాళ్లు ఉంటారని, ఇష్టపడనివాళ్లూ ఉంటారని మీనాక్షి పేర్కొన్నారు. అవి అన్నీ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకుండా మన పనిపై దృష్టి పెట్టడమే ముఖ్యం అని అన్నారు.
ఆరోగ్యం, క్రమశిక్షణ జీవితంలో ఎంతో కీలకమని ఆమె అన్నారు. ఏది తిన్నా శారీరక శ్రమ చేయడం తప్పనిసరిగా జీవితంలో భాగంగా ఉండాలన్నారు. పని, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నీ సమతుల్యతతో ఉండాలని, సమయాన్ని గౌరవించడం, ఇతరుల సమయాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తప్పు చేయవద్దు, ఎవ్వరినీ మనకు తప్పు చేయనివ్వకూడదని తన తండ్రి నేర్పిన విలువలే తన జీవితానికి మార్గదర్శకమని మీనాక్షి అన్నారు. సులువైన పనులను కూడా 100 శాతం అంకితభావంతో చేయడమే జీవితం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.
Redmi Pad 2 Pro 5G: రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ రిలీజ్.. 12,000mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?
పని చేస్తూ ఆనందాన్ని కోల్పోకూడదని, మనం చేసే పనినే ఆస్వాదిస్తే అదే జీవితాన్ని ఆస్వాదించినట్టేనని మీనాక్షి తెలిపారు. పని కోసం జీవించడం కాదు, పనిని ఆస్వాదిస్తూ జీవించడమే నిజమైన జీవితం అంటూ ఆమె వ్యాఖ్యానించారు.