వరంగల్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందింది. మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందినట్లు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యన్‌రాయణ విడుదల చేసిన బులెటిన్‌లో, “మల్లిపుల్ విభాగాల నిపుణులైన వైద్యుల బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారు. ఫిబ్రవరి 26, 2023 రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు ప్రకటించారు.” కాగా, గాంధీ ఆసుపత్రిలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అనంతరం గాంధీ నుంచి వరంగల్‌కు ప్రీతి మృతదేహం తరలించారు. పోలీసు భద్రత మధ్య ప్రీతి మృతదేహం వరంగల్‌కు తరలించారు పోలీసులు. అయితే.. నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read : DK Aruna : ప్రీతి మృతి చాలా బాధాకరం.. సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలి
ప్రీతి మృతితో ఆమె కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రీతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే.. బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించింది. మంత్రి ఎర్రబెల్లి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read : Women World T20: మరోసారి సత్తా చాటిన ఆస్ట్రేలియా.. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై విజయం