Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు. దేశ ప్రధాని, బీజేపీ పార్టీ గురించి ఎలా మాట్లాడుతారని రఘునందన్ రావు ప్రశ్నించారు.
Read Also: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్ ఇచ్చిన మాధవి లత
ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశామన్నారు. ఆయనను సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచాలని, ఆయన్ని మాట్లాడనియకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసి ఫలితాల తర్వాత సీఎం మాట్లాడితే బాగుంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ భయంతోనే తన స్థానానికి ఎక్కడ ఇబ్బంది వస్తోందోనన్న అనుమానంతో ఓటర్లను ప్రలోభపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.