Medak: ఫ్రెండ్ బర్త్ డే కోసం వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన యువకులు.. ఒకరి మృతి
- ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లిన నలుగురు యువకులు
- బర్త్ డే పార్టీలో మద్యం సేవించిన యువకులు
- తిరిగి వస్తుండగా తెల్లవారుజామున మద్యం మత్తులో కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో బోల్తా కొట్టిన కారు
- జశ్వంత్ అనే 18 ఏళ్ల యువకుడు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు.
Also Read:Kissing: అడ్రస్ వెరిఫికేషన్ కోసం వచ్చిన మహిళా ఉద్యోగికి ‘‘ముద్దు’’.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష..
Also Read
పార్టీ అనంతరం తిరిగి వస్తుండగా తెల్లవారుజామున యువకులు మద్యం మత్తులో కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తా కొట్టినట్లు తెలిపారు. ప్రమాద ధాటికి కరెంట్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో జశ్వంత్ అనే 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న నలుగురు యువకులు 20 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
- Tags
- Birth day party
- car
- friends
- medak
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్‌ను కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!