Site icon NTV Telugu

Vizag Crime: విశాఖలో మెడికో సూసైడ్‌.. లాడ్జి గదిలో..!

Woman Suicide

Woman Suicide

Vizag Crime: విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. డాబా గార్డెన్స్ లోని కేరళకు చెందిన మెడికో ప్రాణాలు తీసుకుంది.. లాడ్జి గదిలో ఉరివేసుకొని వేలాడుతున్నట్టు యువతి మృతదేహాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, లోపల నుంచి గడియ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం రావడంతో.. లాడ్జ్ నిర్వాహకుల సమాచారంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు..

Read Also: Minister Mahender Reddy: కేసీఆర్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్నాం

విశాఖ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. చైనాలో ఎంబీబీఎస్‌ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు టూటౌన్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.. మలయాళం భాషలో రాసుకున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. “జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ” సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది యువతి.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు సిద్ధం అయ్యారు.

Exit mobile version