ఒకపక్క కవితను ఈడీ ప్రశ్నిస్తుండగా, మరోపక్క ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతల ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాజ్‌భవన్ వద్దకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు చేరుకున్నారు. అయితే.. రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ మహిళా నేతల యత్నించారు.
Also Read : Topless At Public Swimming: టాప్‌లెస్‌గా మహిళల స్విమ్మింగ్‌కు అనుమతి.. ఏ దేశంలో తెలుసా..?
మేయర్, బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ లేదని పోలీసులు బీఆర్‌ఎస్ మహిళా నేతలను అడ్డుకున్నారు. అయితే..దీంతో రాజ్‌భవన్ ఎదుట మేయర్ విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్లు బైఠాయించారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ మహిళా నేతల నినాదాలు చేస్తున్నారు.
Also Read : Breast Cancer : రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను తెలుసుకోండి
ఉదయం నుంచి గవర్నర్ సమయం ఇవ్వట్లేదన్న మహిళా నేతలు.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేంతవరకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో.. పోలీసులతో మేయర్ విజయలక్ష్మి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మేయర్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.