‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమా ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా టైటిల్ కులతత్వానికి సంబంధించిందిగా.. అవమానకరమైందిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: Madras High Court: హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్
ఇక ఈ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో నిలిపివేయాలని కేంద్రాన్ని మాయావతి కోరారు. సినిమాలో ‘పండిట్’ అనే పదాన్ని ప్రతికూలంగా ఉపయోగించడం వల్ల బ్రాహ్మణ సమాజంలో ఆగ్రహావేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చిత్రం ద్వారా బ్రాహ్మణ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారని తెలిపారు. సమాజాంలోని పెద్ద వర్గం మనోభావాలను దెబ్బతీస్తున్నందున.. అటు వంటి సినిమాను నిలిపివేయాలని కేంద్రాన్ని మాయావతి కోరారు.
ఇది కూడా చదవండి: Ola, Uber, Rapido Strike: ఓలా, ఉబర్, ర్యాపిడో వినియోగదారులకు షాక్.. రేపు దేశవ్యాప్తంగా బంద్
ఈ సినిమా ట్రైలర్లో మనోజ్ బాజ్‌పేయ్ అవినీతిపరుడైన పోలీస్ అధికారి అజయ్ దీక్షిత్ పాత్రలో కనిపించారు. దీంతో ఈ సినిమా వివాదం మొదలైంది. లంచం తీసుకునే అలవాట్లు ఉండడంతో అతన్ని ‘‘పండిట్’’ అనే పిలిచేలా సంభాషణ ఉంది. దీంతో ఒక వర్గం వాళ్లను అవమానించినట్లుగా ఉండడంతో వివాదం మొదలైంది.
