NTV Telugu Site icon

Vijay Hazare Trophy: ఐపీఎల్‌లో అన్‌సోల్డ్ ప్లేయర్.. కట్ చేస్తే..! చితక్కొట్టుడే

Mayank

Mayank

ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను అమ్ముడుపోలేదు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే తాజాగా.. మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ.. విజయ్ హజారే ట్రోపీలో మయాంక్ అగర్వాల్ చితక్కొడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు.

Read Also: MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ.. స్టాలిన్ ప్రకటన..

ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ 97.48 స్ట్రైక్ రేట్‌తో 119 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. మయాంక్ దూకుడు ఇన్నింగ్స్‌తో కర్ణాటక 9 వికెట్ల తేడాతో నాగాలాండ్‌ను ఓడించింది. ఈ టోర్నీలో మయాంక్ అగర్వాల్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ, అతను ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లలో 153.25 సగటుతో.. 111.66 స్ట్రైక్ రేట్‌తో 613 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు 66 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు.

Read Also: CM Revanth Reddy : రేపు ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిచనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ టోర్నీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ 139 పరుగులు చేశాడు. అరుణాచల్‌తో జరిగిన మరుసటి మ్యాచ్‌లో 100 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్ 31న హైదరాబాద్‌తో కర్ణాటక తలపడింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. సౌరాష్ట్రతో జరిగిన చివరి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అతను 65 బంతుల్లో 106.15 స్ట్రైక్ రేట్‌తో 69 పరుగులు చేశాడు. ఇలా.. విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.

Show comments