NTV Telugu Site icon

Delhi Water Crisis: హస్తినలో నీటి కటకట.. కాంగ్రెస్ నేతల నిరసన

Delhi Water Crises

Delhi Water Crises

ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. నీటి సమస్యపై ఆప్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండలు పగలగొట్టి నిరసన చేపట్టారు.

Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..

ఈ నిరసనల్లో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో నీటి కొరత అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో నీటి కొరతను తీర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని, దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. మరోవైపు.. యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున ఢిల్లీలో నీటి ఉత్పత్తి నిరంతరం తగ్గుతోందని నీటిపారుదల శాఖ మంత్రి అతిషి శుక్రవారం తెలిపారు.

Leopard: తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్..

ఢిల్లీకి దక్కాల్సిన నీటి వాటాను బీజేపీ పాలిత హర్యానా విడుదల చేయడం లేదని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జూన్ 6న నీటి ఉత్పత్తి రోజుకు 1,002 మిలియన్ గ్యాలన్లు (MGD) ఉందని.. అది మరుసటి రోజు 993 MGDలకు, జూన్ 8న 990 MGDలకు తగ్గిందని అతిషి చెప్పారు. జూన్ 9న 978 ఎంజీడీలు, మరుసటి రోజు 958 ఎంజీడీలు నమోదైంది. జూన్ 11, 12, 13 తేదీల్లో నీటి ఉత్పత్తి వరుసగా 919 ఎంజిడి, 951 ఎంజిడి, 939 ఎంజిడిలు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు.