ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్-ఎ లో భాగమైన భారత్, శ్రీలంక జట్లు టోర్నీలో మూడో మ్యాచ్ ఆడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటి వరకు ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. భారత్.. సెమీస్ కు వెళ్లాలంటే భారత్‌కు డు ఆర్ డై లాంటింది. టీమిండియా నెట్ రన్ రేట్ (-1.217) ఉంది. ఈరోజు శ్రీలంకను భారీ తేడాతో ఓడించి భారత్ తన రన్ రేట్‌ను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. అంతే కాకుండా.. జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి గనుక, టాప్-2కి వెళ్లాలని చూస్తోంది భారత్. ప్రస్తుతం గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో భారత్ 2 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. శ్రీలంక ఐదో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో శ్రీలకం ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. మరోవైపు.. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుండగా.. టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు.
Delhi: మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం.. సీఎం అతిషి ఇంట్లో వస్తువుల తొలగింపుపై వాగ్యుద్ధం
భారత్ ప్లేయింగ్ ఎలెవన్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సజ్నా, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.
శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: విషమి గుణరత్నే, చమ్రీ అటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికె), అమ కాంచన, సుగంధికా కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధిని, ఇనోకా రణవీర.