టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్..’ఈ నగరానికి ఏమైంది’ మూవీతో తనదైన కామెడీ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు.. ఆ సినిమాతో అభినవ్ పాపులర్ అయ్యారు. వరుసగా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత అభినవ్ ‘మీకు మాత్రమే చెప్తా’ మరియు ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అయితే అభినవ్ గోమఠం తాజాగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్..మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.!. ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో వైశాలి రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి సమర్పణలో ఆరేం రెడ్డి, ప్రశాంత్ మరియు భవాని కాసుల నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి, మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాందిచుకున్న నిర్మాత, పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు.ఈ మూవీ నుంచి ఫస్ట్ షేడ్(ఫస్ట్ లుక్‌ని) ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా మరియు సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అభినవ్ గోమఠం లోని కొత్త కోణాన్ని, నటుడిలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ పతిష్ట రోజే మా సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా లోగోను ఆవిష్కరించడం ఎంతో లక్కీగా భావిస్తున్నాం. అన్ని భావోద్వేగాల మేళవింపుతో లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఫిబ్రవరి ద్వితియార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.