Ganja Seize: సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుండాయ్ కారు, డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా మొత్తం 93 కిలోల గంజాయి బయటపడింది. ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా?
పోలీసుల అందించిన సమాచారం ప్రకారం తనిఖీల్లో గంజాయితో పాటు రూ.11 వేల నగదు, హ్యుండాయ్ కారు, మహారాష్ట్రకు చెందిన డీసీఎం వాహనం, ఐదు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన సోలాపూర్‌కు చెందిన సచిన్ గంగారం, మహేష్, విజయ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్న పోలీసులు, ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా వివరాలు, నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. రాష్ట్రాల మధ్య జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు మరింత కఠినంగా చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Murder In Hyderabad: బోరబండలో కలకలం.. మాట్లాడటం లేదని యువతిని హత్య చేసిన యువకుడు