NTV Telugu Site icon

Fire Accident: మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

Hyd

Hyd

Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో 30కి పైగా కార్లు ఉన్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది తెలిపారు. అవన్నీ మంటలకు ఆహుతి అయిపోయాని సమాచారం. అయితే ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Also Read: Sabitha Indra Reddy : యూజీసీ ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది

అగ్నిమాపక సిబ్బంది షో రూమ్ పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్‌, పైన ఉన్న ఓయో రూమ్స్ కు మంటలు అంటుకోకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. షోరూంలో నష్టం ఎంతవరకు జరిగిందనే విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురైన రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇంకా సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.