పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదీ ఏ ముస్తఫా నగర్‌లోని పెళ్లిళ్లకు డెకరేషన్ చేసే గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళానికి వారికి సమాచారం చేరవేశారు.
దక్షిణ కొరియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం మంటల్లో చిక్కుకుని 24 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగ్‌డాంగ్, ఉసియాంగ్, సంచేయాంగ్, ఉల్సాన్ ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 43వేలకు పైగా ఎగరాల్లో మంటలు వ్యాపించాయి.
రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బహుదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్‌పుర x రోడ్డులోని లారీ మెకానికల్ వర్క్ షాపులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మెకానికల్ వర్క్…
Fire Breaks Out: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న దివాన్‌దేవిడి ప్రాంతంలోని మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటాక ఉదయం 2:15 గంటలకు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మదీనా సర్కిల్ వద్ద…
Massive Fire Incident: హైదరాబాద్ లోని నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేశారు. అయితే, మంటలు పక్కనే ఉన్న…
Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు…
Fire Accident : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద గల సోఫా తయారీ షాపులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద మహావీర్ సోఫా వర్క్స్, మస్కిటో డోర్స్ షాప్ చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపులో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి…