NTV Telugu Site icon

Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire

Fire

Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరిగే అవకాశాలు మరింతగా దిగజారాయి.

Read Also: Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!

ప్రస్తుతం జాతీయ మహిళల వన్డే ఛాంపియన్‌షిప్ 2024-25 కరాచీలో జరుగుతోంది. ఈ కారణంగా వివిధ టీం బృందాలు హోటల్‌లో బస చేశాయి. ఆ సమయంలో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఐదుగురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ప్రమాదం తర్వాత పీసీబీ టోర్నీని మధ్యలోనే నిలిపివేసింది. పాకిస్తాన్ బోర్డు 5 బృందాలు, అధికారుల కోసం హోటళ్లను బుక్ చేసింది. సమాచారం మేరకు, 4 జట్లు ఐదవ రౌండ్‌లో ఆడటానికి వెళ్ళాయి. ఐదుగురు ఆటగాళ్లు మినహా మిగతా క్రికెటర్లు, అధికారులు హోటల్‌లో లేరు. నెట్ ప్రాక్టీస్ కోసం నేషనల్ స్టేడియంలో ఉన్నారు వారంతా.

Read Also: Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?

ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, అయితే వారి వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఐదుగురు ఆటగాళ్లు తమ గదుల్లో ఉన్నారు. దీంతో ఆటగాళ్లు, అధికారుల కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన పై పీసీబీ మాట్లాడుతూ.. ‘టీమ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, కరాచీలో జరిగే జాతీయ మహిళల వన్డే టోర్నమెంట్ 2024-25ను ముగించాలని పీసీబీ నిర్ణయించింది. అదృష్టవశాత్తూ, సంఘటన సమయంలో హోటల్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లను పిసిబి వెంటనే ఖాళీ చేయించడంతో ఎవరికీ ఏమి కాలేదు.