Mokshagnya : డిసెంబర్ 2 మోక్షజ్ఞ సినిమా షురూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mokshagnya : నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమాను హను-మాన్ వంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, చిత్రాన్ని డిసెంబర్ 2న అధికారికంగా లాంఛ్చేయాలని ప్లాన్ చేస్తోందట. డిసెంబర్ 2న క్లాప్ కొట్టి రెగ్యులర్ షూటింగులకు వెళ్లేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ ప్రీపేర్ చేస్తున్నారట.
Read Also:Maharashtra Polls: 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఉద్ధవ్ థాకరే
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది. ప్రతినాయకుడిగా రానా పేరు అనుకుంటున్నట్లు సమాచారం. సినిమాను 2025 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గ్రాఫిక్స్ కూడా భారీగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. తన వారసుడి తొలి సినిమా కావడంతో బాలయ్య కూడా చిన్న కామియో రోల్ చేస్తారని, ఆ పాత్ర సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉంటుందని సినీవర్గాల అంచనా.
Read Also:Off The Record: వైఎస్ జగన్ ఆ నేతలకు పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తే ఇప్పుడు అడ్రస్ లేరా?
ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అలాగే బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని సమర్పిస్తున్నారు. ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. బాలయ్య విజన్‌కు అనుగుణంగా, చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌ల్లో శిక్షణ తీసుకుని ప్రత్యేకంగా రెడీ అయ్యారట.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!