EarthQuake: పాక్ లో భూకంపం.. ఇళ్లనుంచి పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EarthQuake: పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా రికార్డయింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. భూమి కంపించిన వెంటనే ప్రజలు తమ నివాసాలు వదిలి భయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం గురించి సమాచారం లేదు. ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 1: 24 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఇస్లామాబాద్ కు పశ్చిమ దిశగా 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్లేట్ల కదలికల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్ లో సంభవించిన భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం అంచనా వేసింది. 10 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈ నెల 19వ తేదీన 5.6 తీవ్రతతో ఇస్లామాబాద్, ఖైబర్-పఖ్తుంఖ్వాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
Read Also: Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇస్లామాబాద్, పెషావర్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అనేక ఇతర నగరాల్లో ప్రకంపనలు సంభవించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ధాన్యాలను తీసుకెళ్లే లారీలు, భారీ ట్రక్కులను స్థానికులు దాడులు చేసే పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య భూకంపం వల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటు చేసుకోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసినట్టయింది.
Earthquake of Magnitude:4.1, Occurred on 29-01-2023, 13:24:47 IST, Lat: 33.73 & Long: 72.65, Depth: 10 Km ,Location: 37km W of Islamabad, Pakistan for more information Download the BhooKamp App https://t.co/uJynZZAcjk@Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/nAIrBUV9Xy
— National Center for Seismology (@NCS_Earthquake) January 29, 2023
- Tags
- Earthquake
- magnitude
- Pakistan
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!