Earthquake : ఇండోనేసియాను వరుస భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని కెపులౌన్ బటులో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట కంపించినప్పడు భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. మళ్లీ కొన్ని గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. మొదటిసారి భూ అంతర్భాగంలో 43 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండోమారు 40 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చాయని ఈఎంఎస్సీ చెప్పింది. ఈనెల 3న సుమత్రా దీవుల్లో కూడా భూమి కంపించింది. 6.1 తీవ్రత నమోదవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Read Also: Mahesh Kumar Goud : ఢిల్లీలో అమిత్ షా, కేసీఆర్ ఒకటయ్యారు
ఈ ఏడాది జనవరి 9వ తేదీన ఇండోనేషియాలోని తనింబల్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 గా తీవ్రత నమోదైంది. ఆ సమయంలో భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 97 కిలోమీటర్ల లోతులో ఉంది. భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి దూరంగా బయటికి పరుగులు పెట్టారు. మొదట భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు కూడా వచ్చాయి. అయితే, ఎలాంటి సూచనలు లేకపోవడంతో మూడు గంటల తర్వాత ఈ సునామీ హెచ్చరికలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.