Huge Rush In Tirumala: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా గత రెండు రోజుల్లోనే భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లలని నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. దీంతో అధికారులు క్యూలైన్ దర్శనానికి అనుమతి నిలిపివేశారు. కాగా, నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.12 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.
Read Also: Trump: నైజీరియాలో ఐసిస్‌పై ప్రాణాంతక దాడులు చేశాం.. ఉగ్రవాదులు చనిపోయారన్న ట్రంప్
మరోవైపు, ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో గత రెండు రోజుల్లోనే 12 వేలకు పైవా వాహనాల్లో తిరుమలకు భక్తులు వెళ్ళారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తెల్లవారు జామున నుంచి తిరుమల వెళ్లడానికి బారులు తీరినా వాహనాలు పూర్తిస్థాయి తనిఖీల అనంతరం తిరుమలకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమతిస్తున్నారు. ఇక, 12 క్యూలైన్ల ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చెక్ పాయింట్ వద్ద వాహన తనిఖీల కోసం భద్రత సిబ్బందిని మరింత పెంచింది.